​తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ పిలుపుమేరకు రాష్ట్ర నలుమూలల ఉన్న సిపిఐ నాయకులు కార్యకర్తలు  ఈ సభకు తరలి వచ్చారు.ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్.సి,ఎస్.టి సబ్ ప్లాన్ నిధులను ఈ ప్రభుత్వం అమలు చేయటలేదని వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలనీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు నుండి పోరాటం ఉద్రిక్తం చేయటానికి కాకినాడ లో భారీ సభ పెట్టడం జరిగింది.దానిట్లో భాగంగా తూర్ప గోదావరి జిల్లా నుండి మొదట సభ పెట్టి ప్రజలను చైతన్యపరచటానికి రాష్ట్ర సిపిఐ నాయకులు,కార్యకర్తలు అందరూ కాకినాడ లో సభ హాజరావటం జరిగింది.దీనికి అన్ని పార్టీలు మద్దతు తెలిపారు.

ఈ సందర్బంగా ఈ సభను ఉద్దెశించి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుల జి.వీ.హర్షకుమార్ తనయుడు జి.వీ.శ్రీరాజ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేసారు. గతంలో రాజమహేంద్రవరం  లో క్రైస్తవ సమాధులు భూమి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదుఅని కలెక్టరేట్ దగ్గర జరిగిన సభలో కలెక్టర్ కు వినిపించే అంత గట్టిగ కలెక్టర్ ను సూచిస్తూ మాట్లాడారు.అంతేకాకుండ ఈ ప్రభుత్వం ప్రజలకు అందవలిసిన సంక్షేమ పధకాలు కూడా తప్పిదం చేస్తుందని,ఈ ప్రభుత్వమును ఎండగటెందుకు త్వరలో కాకినాడలో జరుగు కార్పొరేషన్ ఎన్నికల ద్వారా ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తగినరీతిలో గుణపాఠం చెబుతారని, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక అవుతుందిఅని జి.వీ.శ్రీరాజ్ తన ప్రసంగం ద్వారా తెలిపారు.యువకుడైనప్పటికీ ఎంతో దూకుడుతనంతో మాట్లాడిన శ్రీరాజ్ ను సీనియర్ నాయకులందరూ చప్పట్లుతో తనకు అభినందనలు తెలిపారు.

Advertisements